TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, అశ్వరావుపేట టౌన్, ఆగస్ట్ 01. అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట క్యాంప్ కార్యాలయంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై, నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఫారెస్ట్ అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను కోరారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం స్థానిక మినీ స్టేడియంలో ఆగస్టు 15 వేడుకల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.