TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. హైదరాబాద్, ఆగస్టు 5: ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌ దంపతులుతో పాటు ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ నాయక్, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) అధ్యక్షుల నియామకాలు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు సమీక్ష నిర్వహించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *