TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్ 12. పెనుబల్లి మండలం విఎం బంజర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వంగా చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విఎం బంజర్ గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వంగ చంద్రశేఖర్ కు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వంగ చంద్రశేఖర్ మాట్లాడుతూ విఎం బంజర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ బలాపేతం కావడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని, మండల కమిటీకి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు.
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…