జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మూడో రోజుకు చేరిన పాదయాత్రTV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్27 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్తో TWJF ఆధ్వర్యంలో కొనసాగుతున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పాదయాత్ర గురువారం మూడో రోజుకు చేరుకుంది.
ఖమ్మం నుంచి పాదయాత్రగా పెనుబల్లి మండలంలోకి చేరుకున్న జర్నలిస్టు సోదరులకు మండల జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విఎం బంజర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జర్నలిస్టులు నినాదాలు చేసుకుంటూ పాదయాత్రగా చేరుకున్నారు.
అనంతరం తహసీల్దార్ను కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో పెనుబల్లి మండలానికి చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.