TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్ సెప్టెంబర్ 25. పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి చోరీలకు పాల్పడటంతో పాటు… సెల్‌ఫోన్ దుకాణాల్లో దొంగతనాలు చేసి, ఆ మొబైల్ ఫోన్లను బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఖమ్మం పోలీసులు సమన్వయంతో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో… ప్రధాన నిందితులతో పాటు అంతర్జాతీయ రిసీవర్లను కలుపుకుని మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

నిందితుల నుంచి 22 లక్షల నగదు, మూడు కార్లు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఛేదించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *