తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం… సిడిపిఒ నిర్మల జ్యోతి.

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి, అక్టోబర్ 7: మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెనుబల్లి సీడీపీఓ నిర్మల జ్యోతి సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

సీడీపీఓ నిర్మల జ్యోతి ఆధ్వర్యంలో పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లోని సప్తపది ఫంక్షన్ హాల్‌లో బుధవారం పోషణ మాసం–2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు సమతుల్యమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓ నిర్మల జ్యోతి మాట్లాడుతూ పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రతి కుటుంబంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ICDS, అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహారంపై మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, మండల నాయకులు, మహిళా నాయకులు, మహిళా సర్పంచ్‌లు, ICDS సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *