SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). దేశవ్యాప్తంగా బుధవారం మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. All India Organisation of Chemists and Druggists పిలుపు మేరకు సుమారు 12.40 లక్షల మెడికల్ షాపులు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు బుధవారం మూతపడనున్నాయి. ఆన్‌లైన్ మందుల విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపడుతున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఫార్మసీ అసోసియేషన్లు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. హైదరాబాద్‌లోనే 16 వేలకుపైగా మెడికల్ షాపులు మూసివేయనున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల అమృత్ ఫార్మసీలు, హాస్పిటల్ లోపలి మెడికల్ షాపులు, 24/7 ఎమర్జెన్సీ మెడికల్ స్టోర్లు యథావిధిగా పనిచేయనున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందుగానే మందులు కొనుగోలు చేసుకోవాలని అసోసియేషన్ సూచించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *