కల్లూరు మండలం, జూన్ 07 (TV6 24/7 NEWS): కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురంలో 90 రోజుల ప్రణాళిక గ్రామ సభ హైస్కూల్ నందు  సర్పంచి నాయుడు వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగినది  ఘనంగా నిర్వహించారు. ఈ సభలో కల్లూరు ఎమ్మార్వో  వీఆర్వో   అగ్రికల్చరల్ ఐకెపిసి అధికారులు, అంగన్వాడీలు, ఆశాలు, గ్రామ పెద్దలు, రైతు సంఘ నాయకులు ముదిగొండ అంజయ్య,  రాములు, ముదిగొండల అంజయ్య మొదలగు వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ  రైతు సంఘం మండల కార్యదర్శి, సిపిఎం మండల కమిటీ సభ్యులు  ముదిగొండ అంజయ్య మాట్లాడుతూ యూరియా యాప్ ను ఎత్తివేయాలని, గ్రామంలో ఉన్నటువంటి అర్హులైన వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలని, గ్రామంలోని డ్రైనేజీలు బాగు చేయాలని, గ్రామంలోని వార్డు మెంబర్లు అందరినీ ప్రతినెలా సమావేశం చేయాలని, గ్రామంలోని రెండు ప్రభుత్వ స్కూల్లు మూతపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి గ్రామస్తులందరూ సహకరించి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని సర్పంచ్ వెంకటకృష్ణ గ్రామస్తులను కోరారు.

మరిన్ని తాజావార్తల కోసం

https://tv624-7news.in/ ఫాలో అవ్వండి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *