TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి నియోజకవర్గం, జూన్ 17. ఎపి వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి “మేకప్ మంత్రి” అని, ఆమె కిలోల కొద్దీ మేకప్ వేసుకుంటారని చేసిన అనుచిత వ్యాఖ్యలను, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షురాలు కోమటి జ్యోతి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా జ్యోతి కృష్ణారావు మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం 33 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి గౌరవిస్తూ ఉంటే, మహిళలను అసభ్యంగా సభ్య సమాజ చీదరించుకునే విధంగా ఒక మాజీ మంత్రివై ఉండి మీకు సిగ్గు అనిపించలేదా ? అని గుడివాడ అమర్నాథ్ ను జ్యోతి కృష్ణారావు ప్రశ్నించారు .

మానవ జన్మ పుట్టిన మీరు రాక్షసుడు లాగా మాట్లాడడం సరికాదని, మహిళలు కన్నెర్ర చేస్తే నువ్వు మాడి మసి అయిపోతావని, నీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా ? వారు ఏదైనా ఫంక్షన్ కి వెళ్తుంటే మేకప్ లేకుండా వెళ్తారా ? మీకు ఇంగిత జ్ఞానం లేదా అని జ్యోతి కృష్ణారావు అమర్నాథ్ పై మండిపడ్డారు.

భారతీయు మహిళలను ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదంగా చూస్తారనే విషయం మీ మట్టి బుర్రకు తెలియదా? అని జ్యోతి కృష్ణారావు ప్రశ్నించారు. మీరు తక్షణమే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ సోదరి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుండా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తిరిగితే మహిళలు తగిన ప్రాయశ్చిత్తం తప్పదు ఖబడ్దార్ గుడివాడ అమర్నాథ్ అని గట్టిగా హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *