TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఢిల్లీ క్యాపిటల్, జూన్ 23. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు డిల్లీలో రాoమోహన్ నాయుడు ను ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల, నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై చర్చించారు.
కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరపున ఫీజు బులిటీ సర్వే చేసినందుకు రాoమోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఫీజుబులిటీ సర్వే లో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేశామని అక్కడ త్వరగా ఫీజుబులిటీ సర్వే చేసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రాoమోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్.. ఐటీసీ బి.పి.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజానికి కేరాఫ్ గా నిలిచింది. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం.
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని రాంమోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడ్డైన రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.