TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, జూన్ 23. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. ఈ పథకాలను మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ
ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతో సొంతింటి కలను నెరవేర్చుతున్నాం. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ వంటి అవకాశాల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం.
గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి మహిళా నాయకురాలికి పార్టీ అండగా ఉంటుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పిస్తాం. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో మహిళలు చురుగ్గా పాల్గొని ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా కృషి చేయాలి. టిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు.