TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. తెలంగాణ, జూన్ 27. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు భరోసా, భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నాం.

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే… రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఉద్యోగుల నుంచి కానీ ఒక్క రూపాయి కూడా అదనపు ప్రీమియం వసూలు చేయకుండా, భాగస్వామ్య బ్యాంకులతో సమన్వయం చేసి ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాం.

ఈ పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.1.20 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు బీమా రక్షణ లభించనుంది. ఇది కేవలం ఒక బీమా పథకం మాత్రమే కాదు… ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న శాశ్వత భరోసా.

దేశ చరిత్రలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంత పెద్ద స్థాయిలో, అదనపు ఆర్థిక భారం లేకుండా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ, ఉద్యోగుల సామాజిక భద్రతను ఈ స్థాయిలో బలోపేతం చేసే నిర్ణయం తీసుకోలేదు. ప్రజా ప్రభుత్వం మాత్రం ఉద్యోగి సంక్షేమాన్ని పాలనలో అత్యున్నత ప్రాధాన్యంగా భావిస్తూ ఈ వినూత్న నిర్ణయాన్ని అమలు చేస్తోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *