TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్ , జూన్ 30. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్త్ పూలమాలలు వేసి, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సిపి సునీల్ దత్త్ మాట్లాడుతూ… సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి ఇప్పటివరకు పోలీస్ శాఖకు ఎనలేని సేవలు అందించారని, రిటైర్ అవుతున్న వారి కుటుంబ సభ్యులందరూ విధినిర్వహణలో వీరికి
ఎంతో తోడ్పాటు అందించబట్టే వీరు సంతోషంగా విధులు నిర్వహించారని, ఈ సందర్భంగా రిటైర్ అవుతున్న వారి కుటుంబ సభ్యులకు కూడా సిపి సునీల్ దత్త్ అభినందనలు తెలియజేశారు.

పదవి విరమణ పొందిన వీరందరూ ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా గడపాలని వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, సిసిఆర్బీ ఏసీపీ సాంబరాజు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సిఐ సర్వయ్య, ఆర్ఐలు కామరాజు, నాగుల్ మీరా, అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.