TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, సత్తుపల్లి టౌన్, జూన్ 30. సత్తుపల్లి మున్సిపాలిటీ 21వ వార్డులో జరుగుతున్న SIR (Special Intensive Revision) కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా దయానంద్ విజయమార్ BLOలతో మాట్లాడి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో తప్పకుండా ఉండేలా అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్క ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా బాధ్యతగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ SIR ప్రక్రియలో భాగస్వాములు కావాలి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, BLAలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి అర్హుడి ఓటు పరిరక్షణకు కృషి చేయాలని డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సూచించారు.