TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జులై 29. గురు పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు. పెనుబల్లి సాయి పీఠం కమిటీ సభ్యులు బొర్ర శ్రీను ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు, గురుపూజ, సాయి భజనలు, కీర్తనలు నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబా ఆశీస్సులు పొందుతూ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు మహాప్రసాదాన్ని అందించారు. గురువును దైవ స్వరూపంగా భావిస్తూ నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సాయి భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—————————
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…