TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, ఆగస్ట్ 01. జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 6న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సన్నాహక సమావేశంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై చర్చించారు.

ఈ సందర్భంగా జనసేన విద్యార్థి విభాగం నాయకులు మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ, “పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. జీవో నెం. 9ను నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో అమలు చేయాలి. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 6న ధర్నా చౌక్‌లో నిర్వహించే రిలే నిరాహార దీక్షను విద్యార్థులు విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెంటల మహేష్, వినోద్ నాయక్, ఆరని గౌతమ్,తాళ్లూరి కౌశిక్, ప్రశాంత్, ఉదయ్,పారిపల్ల అక్షయ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *