TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్.
పెనబల్లి మండలం, విఎం బంజర్ పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ వీఎం బంజర్ పాఠశాలలో విద్యార్థి ఎన్నికలను సాధారణ ఎన్నికల తరహాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఉపాధ్యాయులు వి.వి. రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్. భాస్కరరావు విజేతలకు సూచనలు, సలహాలు అందించారు.
ఎన్నికల్లో SPLగా ఎం. గాయత్రి, జనరల్ సెక్రటరీగా ఎస్కే. సూరజ్, కల్చరల్ సెక్రటరీగా జి. ఉమ, గేమ్స్ సెక్రటరీగా పి. అహల్య, గర్ల్స్ రిప్రజెంటేటివ్గా టీ. మనీషా ఎన్నికయ్యారు. గెలుపొందిన విద్యార్థులను ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో పిల్లలకు అవగాహన కల్పించేందుకు స్కూల్లో నిర్వహించిన ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇన్చార్జి హెడ్మాస్టర్ భాస్కర్ రావు తెలియచేశారు.