TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, ఆగస్ట్ 16. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని పాత చిన్నమ్మగూడెంలో ఆదివారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దూదిపాళ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరిగింది.

ఈ సందర్భంగా సుమారు 200 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు, ఆరోగ్య సలహాలు అందించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *