అశ్వారావుపేట
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ములకలపల్లి మండలం , ఆగస్ట్ 21. అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని కమలాపురం గ్రామంలో నేను సైతం చేయూత – విద్యా యాత్ర, మన ఎమ్మెల్యే – మన బడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమలాపురం ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే… విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు నూతన బోరువెల్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, బోధనా విధానం, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం వడ్డించడంతో పాటు, వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకుని, మంచిగా విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు.
గిరిజన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు.