TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, శేరిలింగంపల్లి: ఆగస్ట్ 22. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన DCC అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా DCC అధ్యక్ష నియామక కో-ఆర్డినేటర్‌గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. కర్ణాటక MLC, AICC సెక్రటరీ సి.వి. మోహన్ అబ్జర్వర్‌గా, TPCC అబ్జర్వర్లుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈ.వి. శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంటెస్టెడ్ అభ్యర్థులు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, SC, ST సెల్ నాయకులు, మండల, డివిజన్ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై DCC అధ్యక్షుడి ఎంపికపై వారి అభిప్రాయాలను సేకరించారు.

పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని DCC అధ్యక్ష నియామకానికి సంబంధించిన వివరాలను పార్టీ అధిష్ఠానానికి నివేదించనున్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *