TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, వేంసూరు మండలం, ఆగస్ట్ 24. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో కలుషిత అల్పాహారం తిన్న ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు పుటాహుటిన అస్వస్థతకు గురైన విద్యార్థులనువేంసూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది విద్యార్థులకు చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు అల్పాహారంగా ఉప్మా తిన్న తర్వాతే అనారోగ్యానికి గురి కావడంతో ఆహారం కలుషితం కావడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై సంబంధిత అధికారులు వివరాలను సేకరిస్తూ విచారణ చేపడుతున్నారు.ప్రస్తుతం అనారోగ్యం పాలైన ఎనిమిది మంది విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారని ఉపాధ్యాయులు తెలియజేశారు. విద్యార్థులలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.