TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పాలేరు, ఆగస్ట్ 26. పాలేరు నియోజకవర్గం, ఖమ్మం టౌన్ పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు
ఈ సందర్భంగా 1 కోటి రూపాయలతో ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్ లో కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి కైకొండాయిగూడెం ప్రాథమిక పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు, 1 కోటి 12 లక్షల అంచనా వ్యయంతో దానవాయిగూడెం 59వ డివిజన్ లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. పేదల సంక్షేమం, గ్రామాల ప్రగతి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
SIR పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.
ఖమ్మం క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో మంత్రి పొంగులేటిగారు పాల్గొన్నారు. ఓట్ల సవరణ పేరుతో కేంద్రం భారీగా ఓట్లు తొలగించే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ముఖ్యంగా బిఎల్ఎ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.