TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 09. ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన మిరియాల రమాదేవి అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు అత్యవసర ఆపరేషన్ కోసం సుమారు రూ.3 లక్షలు అవసరం కాగా, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించేందుకు ప్రత్యేక చొరవ చూపారు. మంజూరైన ఎల్ఓసీ చెక్కును హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి రమాదేవి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. అనంతరం రమాదేవి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
అదేవిధంగా అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన నిమ్స్ ఆసుపత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన వైద్య సహాయాన్ని అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.