TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, సెప్టెంబర్ 10: అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఛాంబర్‌లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రజా పాలనకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.

నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

సత్తుపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *