తల్లాడ మండలం, జూన్ 11 (TV6 24/7 NEWS):తల్లాడ మండల కేంద్రంగా ఉన్నటువంటి తల్లాడ పట్టణంలో 24 గంటల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. వర్షాకాల సీజన్లో నిరంతరం వచ్చే వ్యాదులు, వివిధ రోగాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా తల్లాడ మండల కేంద్రంలో 24 గంటల ఆసుపత్రిని అందుబాటులో ఉంచాలని తల్లాడ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి పెరిక కిరణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో మూడు మండల కేంద్రాలలో (CHC )ఏర్పాటు జరిగిందని, అధిక జనాభా ఉన్న తల్లాడ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయికే పరిమితం అయిపోయిందని. గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు, పిల్లలకు, వృద్ధులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా తల్లాడలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కిరణ్ అన్నారు. వివిధ రకాల డయాగ్నస్టిక్స్ టెస్టులు, గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్లు, వివిధ శస్త్ర చికిత్సలకు దూరప్రాంతాలకు వెళ్లడం వలన ఇబ్బందులకు గురవుతున్నారు. కావున మన తల్లాడ లో ఉంటే అన్ని రకాలుగా వైద్య సేవలు అందించే విధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని తల్లాడ మండల కిరణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.