TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జూన్ 20. పెనుబల్లి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన నాదెండ్ల శ్రీనివాసరావు ఇటీవల వడదెబ్బతో మరణించగా శ్రీనివాసరావు కుటుంబానికి పెనుబల్లి మండల కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.

శ్రీనివాసరావు విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వడదెబ్బ కారణంగా మరణించాడు. శ్రీనివాసరావు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో బంధువులు స్నేహితులు పెనుబల్లి మండల కమ్మ సేవా సమితి సభ్యులు శ్రీనివాసరావు కుటుంబానికి పినపల్లి మండల కాకతీయ కమ్మ సేవా సమితి కమిటీ సభ్యులు అండగా నిలిచి దశదినకర్మను జరిపించారు. శ్రీనివాసరావుకు ఇద్దరు ఆడపిల్లలు కావడం చేత వారిద్దరి పేరు మీద విఎం బంజర్ స్టేట్ బ్యాంక్ నందు 70 వేల రూపాయలు డిపాజిట్ చేశారు.

ఈ సందర్భంగా కమ్మ సోదరులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాసరావు కుటుంబం చాలా దయనీయంగా ఉందని, ఎవరైనా మనసున్న మహారాజులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించవలసిన వారు ఈ ఫోన్ నెంబర్ కు (9492958116) ఫోన్ చేయాలని తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *