TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. ఖమ్మం టౌన్, జూన్ 21. ఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ…… సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులో ఒక పెద్ద కుంభకోణం చోటుచేసుకుందని ఆరోపించారు.
ధరల తీవ్ర తగ్గింపు: తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGIIC) నిబంధనల ప్రకారం ఎకరా కనీస మద్దతు ధర ₹40 లక్షలుగా నిర్ణయిస్తే, దానికి విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ప్రైవేట్ రొయ్యల సీడ్ కంపెనీకి కేవలం ₹21 లక్షలకే 75 ఎకరాల పైగా భూమిని కేటాయించడం వెనుక ఉన్న మతలబు ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
మంత్రివర్గ, అంతర్జాతీయ సంస్థల అనుమతులు ఎక్కడ ? గతంలో దివంగత వైఎస్ఆర్ హయాంలో పేద గిరిజనులు, ఎస్సీ, ఎస్టీల నుండి సేకరించిన ఈ భూమిని, కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో మౌలిక వసతులు కల్పించిన అనంతరం ఇంత తక్కువ ధరకు కేటాయించడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం ఉందా? ఇందులో నాబార్డ్ వాటా 30%, కేంద్ర ప్రభుత్వ వాటా ఉండగా… వారి నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారు? దీని వెనుక జిల్లాకు చెందిన ఏ మంత్రి వర్గం, లేదా వారి కుమారుల హస్తం ఉందో స్పష్టం చేయలని డిమాండ్ చేశారు.