TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి మండలం, జులై 11. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో సానిక.పుల్లయ్య 37 సంవత్సరాలు. మద్యానికి బానిసై కుటుంబ కలహాల నేపథ్యంలో ఎలుకలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది EMT ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల. కృష్ణ వాహన చోదకుడు పైలెట్ కట్టం. మహేష్ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రథమ చికిత్స అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సకాలంలో స్పందించిన సత్తుపల్లి 108 సిబ్బందిని మూడు జిల్లాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ప్రోగ్రాం మేనేజర్ షేక్. నజీరుద్దీన్, ఖమ్మం జిల్లా 108 మేనేజర్ అవులూరి. దుర్గాప్రసాద్ కిష్టారం గ్రామస్తులు అభినందించారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *