TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులు, హోంగార్డ్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేసిన కమిషనర్, సుదీర్ఘకాలం వివిధ విభాగాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించినందుకు వారిని అభినందించారు. విధి నిర్వహణలో సహకరించిన కుటుంబ సభ్యుల పాత్రను కూడా ప్రశంసిస్తూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఎస్సై సయ్యద్ అమీర్ అలీ, ఏఎస్‌ఐలు వి. హనుమంతరావు, జి. చిన్నప్ప, టి. ప్రసాదరావు, ఎన్. జయబాబు, హెడ్ కానిస్టేబుళ్లు కె. దాతురామ్, జె. జానయ్య, యండి. అబ్దుల్ ఘనీ పాషా, హోంగార్డ్ పి. శ్రీనివాస్ రావును సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, ఖమ్మం జిల్లా హోంగార్డు సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంక శ్రీను, జాతీయ ఉపాధ్యక్షుడు సీసీ-21 ఈ. వెంకటేశ్వర్లు, సంక్షేమ సంఘం సీనియర్ అడ్వైజర్ డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *