TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్. పెనుబల్లి అక్టోబర్ 4 : పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి కిరణ్ ఆదివారం తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ దంపతులు కిరణ్ను శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ.. మిట్టపల్లి కిరణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తూ, ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు అందించిన ప్రత్యేక ఆశీస్సులతో మిట్టపల్లి కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు.