TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్.
దమ్మపేట, ఆగస్టు 2: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలో రూ.1.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. “హలో శుభోదయం” కార్యక్రమంలో భాగంగా నూతన సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని వివిధ వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ దమ్మపేటను ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *