రామలింగేశ్వర స్వామి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన – శరన్నవరాత్రుల వేళ వైభవంగా పూజలు – 200 మంది మహిళలకు చీరల పంపిణీ

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి అక్టోబర్ 19 దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండల పరిధిలోని అడవి గంగదిపాడులో వెలసియున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం కుంకుమ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ చైర్మన్ కనగాల సాంబశివరావు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి గ్రామం నుంచి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న సుమారు 200 మంది మహిళా భక్తులకు దాతలు చీరలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన దంతనపల్లి వెంకటేశ్వరరావు – రాణి, బుడ్డి సోమేశ్వరరావు – ప్రియాంక, సుఖవాసి గణేష్ – ఉష దంపతులు మహిళలకు చీరలను స్వయంగా అందజేశారు. దాతల సేవాభావాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *