SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పేకాట ఆడుతున్న ఐదుగురిని వేంసూర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్లు వేంసూర్ ఎస్సై కవిత తెలిపారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు వేంసూరు మండలం, కుంచపర్తి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచార మేరకు దాడులు నిర్వహించి ఐదుగురిని పట్టుకొన్న వేంసూరు పోలీసులు, వారివద్ద నుండి రూ. 6,800 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 3 మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై కవిత తెలిపారు.
