TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, అశ్వరావుపేట, జులై 09. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిని సందర్శించి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రిలోని రోగులకు పళ్ళు, బ్రెడ్స్ పంపిణీ చేశారు.

నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అశ్వారావుపేట మున్సిపాలిటీకి చెందిన పత్తిపాటి కామేశ్వరరావుకి అత్యవసర సర్జరీ నిమిత్తం రెండులక్షల యాభైవేలు, ములకలపల్లి మండలానికి చెందిన సి.హెచ్. వెంకటేశ్వరరావుకి రెండులక్షల యాభైవేలు, ములకలపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన ఉప్పునూతి రమణకి లక్ష యాభైవేలు మంజూరు చేయించి LOC కాపీలను బాధితులకు అందజేశారు. ట్రీట్మెంట్ పొందుతున్న వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని భయపడవద్దని త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు.