TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి మండలం, జులై 07. సత్తుపల్లి మండలం గంగారం గ్రామ అభివృద్ధి ప్రదాత, మాజీ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టినాయన) జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దాసరి వెంకటరామిరెడ్డి కుమారుడు దాసరి మధుమోహన్ రెడ్డి ఆర్థిక సహకారంతో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్‌తో పాటు గంగారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం స్కూల్ బెంచీలను ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ…. గ్రామ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రజా సేవలో ముందుంటున్న దాసరి వెంకటరామిరెడ్డి, దాసరి మధుమోహన్ రెడ్డి సమాజానికి ఆదర్శంగా గెలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా దాసరి వెంకటరామిరెడ్డి దంపతులను, దాసరి మధుమోహన్ రెడ్డిని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, గ్రామ సర్పంచ్ కాకర్ల రేవతి, ఎంఈఓ రాజేశ్వరరావు, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ నాగమణి, కాంప్లెక్స్ ప్రిన్సిపాల్ సైలా కుమారి, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గంగారాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావేటి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు చెన్నారావు, రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *