TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, ఖమ్మం టౌన్, జులై 07. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో 300 మంది లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ మొత్తం రూ.88.78 లక్షల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్య ఖర్చులకు అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులకు ఎంపీ రఘురాం రెడ్డి అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కూడా కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.