TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, సెప్టెంబర్ 18. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో గురువారం సాయంత్రం రెండు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మండల పరిధిలోని ఉప్పలచిలక గ్రామంలో కస్తూరిబా స్కూల్ సమీపంలో ఎక్సెల్ పై రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి గుమ్మ నరసింహారావు అనే వ్యక్తిని వెనుక వైపు నుంచి యూనికాన్ బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
సమాచారం తెలుసుకున్న జాతీయ రహదారి అంబులెన్స్ సిబ్బంది పైలెట్ వీరయ్య, టెక్నీషియన్ సాంబశివరావు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన నరసింహారావును పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో ప్రమాదం మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో చిన్యా తండాకు చెందిన మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆటో ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. గాయపడిన మైనర్ బాలుణ్ణి పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అందించారు.