ఖమ్మం, సెప్టెంబర్ 24: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు.
నేటి సెలవుకు ప్రత్యామ్నాయంగా వచ్చే నెల రెండో శనివారం విద్యాసంస్థలు సాధారణ పనిదినంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.