​— ప్రేక్షకుల ఆదరణే మా బలం: జె. శ్రీనివాస్

​ఖమ్మం, అక్టోబర్ 20: TV6 24/7 న్యూస్ ఛానల్ వీక్షకులకు, సబ్‌స్క్రైబర్‌లకు ఛానల్ నిర్వాహకులు జె. శ్రీనివాస్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, ఆ దుర్గాభవాని అనుగ్రహంతో అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

​గత మూడు సంవత్సరాలుగా TV6 24/7 న్యూస్ అందిస్తున్న వార్తా కథనాలను ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికీ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన నిలుస్తూ మరింత నాణ్యమైన సమాచారాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మా ఛానల్ వీక్షకులు, అభిమానులు ఏవైనా వార్తలు లేదా సమాచారం కోసం 9642042789 నంబరును సంప్రదించవచ్చని శ్రీనివాస్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *