TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, పెనుబల్లి మండలం, జులై 03. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సహకారంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్ సూచనలు మేరకు ఇజిఎస్ నిధుల నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువచేసే సిసి రోడ్ల నిర్మాణం గురువారం చేపట్టారు.
ఈసీసీ రోడ్ల నిర్మాణాన్ని స్థానిక సర్పంచ్ బానోతు పాప, ఉప సర్పంచ్ చీపి కృష్ణారావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాప మాట్లాడుతూ… నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. పెనుబల్లి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, పెనుబల్లి గ్రామానికి అభివృద్ధి పథకాలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులకు పల్లి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు.