TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మండలం, ఆగస్ట్ 21. తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఇంటి చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడు జంగాల స్వరూప్ కుమార్ @ శాంతి స్వరూప్ @ వినయ్ కుమార్ (41)ను శుక్రవారం ఉదయం తల్లాడ బస్‌స్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు వైరా సీఐ వెంకటప్రసాద్ తెలిపారు.

గంగదేవిపాడు గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ఇనుప బీరువాను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడన్నారు. అదేవిధంగా తల్లాడలో మరో ఇంటి తాళం పగులగొట్టి రెండు బంగారు ఉంగరాలను చోరీ చేసి, వాటిని గన్నవరం ప్రాంతంలోని ఎస్.ఆర్. బంగారం దుకాణంలో విక్రయించినట్లు వెల్లడించాడని తెలిపారు.

నిందితుడి నుంచి మొత్తం రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లాడ ఎస్సై ఎన్. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా, నిందితుడికి గతంలోనూ పలు చోరీ, ఇంటి దొంగతనం కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సీఐ తెలిపారు.

వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పాత కేసులను పరిశీలిస్తూ, నిందితుడి ప్రమేయం ఉన్న ఇతర ఆస్తి నేరాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *