మహిళలతో కలిసి కోలాటం ఆడిన కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, కాంగ్రెస్ నాయకులు ఈడా కమలాకర్, సర్పంచ్ రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. పెనుబల్లి అక్టోబర్ 18. మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ నాయకులు ఈడా కమలాకర్, స్థానిక సర్పంచ్ రాంబాబుల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహించారు.
ఈ సంబరాలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్ విజయకుమార్ గ్రామ మహిళలతో కలిసి కోలాట నృత్యాలు చేస్తూ, ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొని అందరిలో నూతనోత్తేజాన్ని నింపారు.
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఐక్యతను, ప్రకృతిని గౌరవించే గొప్ప వేడుక అని ఆయన పేర్కొన్నారు.గ్రామానికి చెందిన మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రధారణతో తరలివచ్చి, తీరొక్క రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ, బతుకమ్మ పాటలతో గ్రామంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.