TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, సత్తుపల్లి టౌన్, జూలై 10. సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలకు చెందిన ట్రాన్స్‌ఫర్లు, పదోన్నతులు పొందిన అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ ఆయాలకు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆర్డర్ కాపీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్‌వాడీ వ్యవస్థ చిన్నారులు, గర్భిణీలు, బాలింతల సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలని సూచించారు. ట్రాన్స్‌ఫర్లు, పదోన్నతులు పొందిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ కొత్త బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *