TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్ సత్తుపల్లి, జూలై 14 తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రీ-ప్రైమరీ పాఠశాల చిన్నారుల రవాణా కోసం బుగ్గపాడు ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ స్కూల్కు నూతన ఎలక్ట్రిక్ ఆటోను అందజేశారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్లోని నూతన ఆక్వా దీపక్ కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఆటోను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాఠశాలకు అందజేశారు. చిన్నారులు ఇంటి నుంచి పాఠశాలకు, పాఠశాల నుంచి ఇంటికి సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమని బుగ్గపాడు గ్రామస్తులు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు బుగ్గపాడు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. వారితో సరదాగా గడుపుతూ విద్య, పోషకాహారం, ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చిన్నారుల భవిష్యత్తు కోసం ఇలాంటి వినూత్న కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎంఇఒ రాజేశ్వర్ రావు, ఎంపీడీఓ నాగేశ్వరావు, బుగ్గపాడు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సెక్రటరీ, సీనియర్ నాయకులు గోపాల్ రావు, రవీంద్ర బాబు, సీనియర్ నాయకులు కిసర రాంబాబు, బుగ్గపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవరావు, బుగ్గపాడు ఇందిరమ్మ కమిటీ, బుగ్గపాడు కాంగ్రెస్ పార్టీ కమిటీ, మహిళ లు,సత్తుపల్లి మండలం,, బుగ్గపాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.