TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, మండలం, ఆగస్ట్ 08. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని శ్రీ రాజ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా పలువురు నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు.
ఆలయ నిర్వాహకులు జెన్నారెడ్డి నర్సారెడ్డి ఆధ్వర్యంలో గత నెల 5వ తేదీన పీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆపరేషన్ అవసరమైన వారిని ప్రత్యేక బస్సులో కాకినాడలోని కిరణ్ కంటి ఆసుపత్రికి తరలించి, అవసరమైన ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందించారు.
ఆపరేషన్లు చేయించుకున్న రోగులకు శనివారం విఎం బంజర్లోని శ్రీ రాజ సాయిబాబా మందిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తమకు ఉచితంగా వైద్యం అందించడంపై రోగులు సంతోషం వ్యక్తం చేశారు.
—————————
📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in
మన ప్రాంత వార్తలు… మనకోసం…