పండుగ రోజూ పోలీస్ స్టేషన్‌కేనా..? “బతకడం కంటే చావడమే మేలు” | కల్లూరులో సెల్ఫీ వీడియో కలకలం

TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కల్లూరు మండలం, సెప్టెంబర్ 14. కల్లూరు మండలం లోకారం గ్రామానికి చెందిన కోటి అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి పండుగ రోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కంటే చావడమే మేలంటూ వీడియోలో పేర్కొన్న కోటి.. అనంతరం పొలం వద్దకు వెళ్లి పురుగుమందు తాగినట్లు సమాచారం.

కోటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను చూసిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై పొలం వద్దకు చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలు కోటి తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఏముంది? ఆయన ఏం చెప్పాడు? ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

**TV6 24/7 NEWS – మన ప్రాంత వార్తలు మన కోసం**

#Kalluru #Lokaram #KhammamNews #TelanganaNews #SelfieVideo #BreakingNews #TV6247News #LocalNews

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *