TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్, జూన్ 22. తెలంగాణలో నీట్ పరీక్ష కేంద్రం వద్ద భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కీసరలోని పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా చేరుకున్న కొందరు విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు.

తన కుమార్తెను పరీక్ష రాయనివ్వాలంటూ ఓ తండ్రి పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపడంతో ఆలస్యమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో తండ్రీకూతుళ్లు కన్నీటితో వెనుదిరిగారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *