TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్వర్క్, కల్లూరు టౌన్, జూన్ 29. ఖమ్మం జిల్లా, కల్లూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిసిసిబి బ్యాంక్ ప్రారంభోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించిన మంత్రి తుమ్మల.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ బ్యాంక్ సిబ్బంది రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, తుమ్మల అభిమానులు, మట్టా దయానంద అభిమానులు పాల్గొన్నారు