TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్, పెనుబల్లి మండలం, జులై 10. మానవత్వాన్ని చాటుతూ ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు మరకాల బ్రదర్స్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజార గ్రామానికి చెందిన సింగిశాల ప్రకాష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మరకాల బ్రదర్స్, ఆయన శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మరకల బ్రదర్స్ మాట్లాడుతూ ప్రకాష్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై, ఆయన త్వరగా కోలుకుని ఎప్పటిలాగే ప్రజల మధ్య ఆరోగ్యంగా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. మరకాల బ్రదర్స్ చేసిన ఈ సహాయంపై ప్రకాష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

—————————

📍 TV624 24/7 NEWS
🌐 https://tv624-7news.in

మన ప్రాంత వార్తలు… మనకోసం…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *