TV6 24/7 NEWS – డిజిటల్ మీడియా నెట్‌వర్క్. కల్లూరు టౌన్, జూలై 30: సత్తుపల్లి నియోజకవర్గం లోని కల్లూరు, తల్లాడ మండలాలకు సంబంధించిన ప్రజా దర్బార్ – రైతు సదస్సు కార్యక్రమం గురువారం కల్లూరులోని డీఎన్‌పీ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, జిల్లా కలెక్టర్ దివాకర్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కల్లూరు, తల్లాడ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు, ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో మంత్రి, ఎమ్మెల్యేలకు అందజేయగా, వారు ప్రతి వినతిని స్వయంగా విని స్వీకరించి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం చేరి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ… ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీకి న్యాయం జరిగేలా కృషి చేస్తామని అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ… సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *